పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా హను రాఘవపూడి సినిమాకి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతాడు.
Also Read:Rishab Shetty: నాగవంశీతో రిషబ్ శెట్టి సినిమా?
ఆ తర్వాత, నాగ అశ్విన్ దర్శకత్వంలో కలిసి కల్కి 2898 AD సిక్వెల్ తో పాటు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సిక్వెల్ కూడా చేయాల్సి ఉంది. అయితే, ఇదిలా ఉండగా, ప్రభాస్ మరో తమిళ దర్శకుడితో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. అది కూడా ఒక పోలీస్ అధికారి పాత్రతో ఉండే సినిమా అని అంటున్నారు. ఆ దర్శకుడు ఇంకెవరో కాదు, ఈ మధ్యనే అమరున్ అనే సినిమా చేసి తమిళంలో 300 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన రాజకుమార్ పెరియాసామి.
Also Read:Botsa Satyanarayana: చంద్రబాబు వంద అబద్దాలు చెబితే.. లోకేష్ రెండు వందలు చెప్తున్నాడు..
ఇక, ప్రభాస్ రాజకుమార్ పెరియాసామి చెప్పిన కథ నచ్చడంతో, పూర్తి స్టోరీ డెవలప్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేసి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా పట్టాలకు అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల యూవీ క్రియేషన్స్ కేవలం ప్రభాస్ సినిమాలే కాక, భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తుంది.