Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Ramprasad Reddy Started Rtc Buses In Kuppam

Minister Ramprasad Reddy: కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు

Published Date :June 26, 2024 , 10:49 am
By Rajesh Veeramalla
  • కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • డీజిల్ రెట్లు తగ్గినా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది- మంత్రి
  • శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం
  • రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించం
  • కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటాం- మంత్రి
Minister Ramprasad Reddy: కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. అన్ని ప్రాంతాలకు సర్వీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు. మరోవైపు.. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడుతామని తెలిపారు. 5 కొత్త బస్సులను ప్రారంభించామని.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Read Also: Julian Assange: అస్సాంజేకి విముక్తి.. సుదీర్ఘ వివాదానికి ముగింపు..

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని.. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని తెలిపారు. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పని చేయాలని పేర్కొన్నారు. కార్మికులు, ప్రయాణికులు కళ్ళు లాంటి వారని అన్నారు. మరోవైపు.. డిపోలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ప్రభుత్వంతో ఏపీఏస్ ఆర్టీసీని 100 శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా.. కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • kuppam
  • Minister Ramprasad Reddy
  • RTC buses
  • start

తాజావార్తలు

  • Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు

  • Lungi Ngidi Ball: లుంగి ఎంగిడి అద్భుత బంతి.. నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా!

  • Rajamouli : ధురంధర్ దారిలో వారణాసి.. వర్కౌట్ అవుతుందా?

  • Earthquake: ఇండోనేషియాలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ అలలు

  • Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions