Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
- సూరారంలో విషాద ఘటన
- ఇంట్లో ఆడుకుంటూ నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన ఆ నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలో నివాసముంటున్న దంపతులు రోజువారీ కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో వారి పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో పదేళ్ల పెద్ద కుమార్తె చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆడుకుంటూ తిరుగుతున్న ఏడాదిన్నర చిన్నారి, ఇంట్లో నీటితో నింపి ఉంచిన బకెట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు బకెట్లోకి తలకిందులుగా పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.
కాసేపటి తర్వాత బయటకు వచ్చిన అక్క చాందిని, బకెట్లో పడి అచేతనంగా పడి ఉన్న చిన్నారిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. కళ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి స్థానికులు కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
- Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసలు, కట్టెల దుకాణం.!
- HCA Scam: హెచ్‌సీఏలో అవినీతి తిమింగలాలు.. సీఐడీ 80 పేజీల చార్జిషీట్లో విస్మయం కలిగించే నిజాలు!
తాజావార్తలు
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!