Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి కచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
నామినేషన్ల సమయంలో అరాచకాలు సృష్టించారు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ఈ క్రమంలో అరాచకాలు సృష్టించారని విమర్శించారు. వాహనాలను ధ్వంసం చేశారని, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనేక అడ్డంకులు కల్పించారని పేర్కొన్నారు. మరోవైపు, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నామినేషన్లు వేసుకునేలా పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు.
Also Read
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
ఈ ఘటనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని పెద్దిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులపై కేసులు నమోదు చేశారని, అనేక మందికి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఐదు కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డిని ఏ-1గా పేర్కొన్నారని ప్రస్తావించారు. టీడీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించిన ఆయన, తమ పార్టీ అభ్యర్థులకు మాత్రం తగిన సహకారం అందడం లేదని అన్నారు. అయితే, నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు స్పందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసిందని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ పరిణామం తమ పార్టీకి అనుకూలమని పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే విషయంలో తమ పార్టీ అభ్యర్థులకు ఎదురైన ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాలతో న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
19 మున్సిపాలిటీల్లో పోటీ.. వైసీపీదే విజయమని ధీమా
రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎదురైన అడ్డంకులు, కేసులు, నోటీసులు తమ పార్టీ విజయాన్ని అడ్డుకోలేవని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సమయంలో అభ్యర్థులకు పోలీసులు ఏ మేరకు భద్రత కల్పిస్తున్నారో మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ల దశలోనే అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి భద్రత విషయంలోనూ ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..
తాజావార్తలు
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
-
CM Chandrababu: రెబల్స్‌కు చంద్రబాబు ఫైనల్ వార్నింగ్.. నామినేషన్లు విత్‌డ్రా చేసుకోకుంటే వేటే..!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!