AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ సుమిత్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉపసంహరణ కేంద్రాలన్నింటినీ చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండేలా, నామినేషన్ల ఉపసంహరణ సక్రమంగా జరిగేలా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
భారీ పోలీసు భద్రత మధ్య నామినేషన్ల తరలింపు
ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాల నుంచి సంబంధిత నామినేషన్ పత్రాలను భారీ పోలీసు భద్రత నడుమ చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపసంహరణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.
Also Read
- AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
- Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
- RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
కలెక్టర్ ఎదుట సంతకం చేస్తేనే ఉపసంహరణ
నామినేషన్ల ఉపసంహరణ విషయంలోనూ ప్రత్యేక నిబంధనలను అమలు చేయనున్నారు. అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ సుమిత్ కుమార్ ఎదుట సంతకం చేసినప్పుడే నామినేషన్ ఉపసంహరణను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఈ విధంగా అభ్యర్థుల సమక్షంలోనే ప్రక్రియను నిర్వహించడం ద్వారా ఉపసంహరణల విషయంలో స్పష్టత ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
కార్పొరేషన్ కార్యాలయం నుంచే కలెక్టర్ పర్యవేక్షణ
నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను కలెక్టర్ సుమిత్ కుమార్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉండి స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లకు ఇప్పటికే 15 నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉపసంహరణ ప్రక్రియను ఒకే చోట నిర్వహించాలన్న నిర్ణయం ఎన్నికల ఏర్పాట్లలో ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్‌లో మరో వన్ వే.. లక్డీకాపూల్‌లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!