Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా రూ.922 కోట్ల నికర నష్టం రావడంతో షేర్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లో ఒకే రోజు సుమారు 17 శాతం వరకు క్షీణించి రూ.174.90 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. కంపెనీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.7,571 కోట్లకు చేరినప్పటికీ, గత త్రైమాసికంతో పోలిస్తే నష్టాలు మరింత పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ పెరగడం, అదే సమయంలో లాభాల బాట పట్టకపోవడం ఈ పతనానికి ప్రధాన కారణంగా మారింది.
ముఖ్యంగా స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ‘ఇన్‌స్టామార్ట్’ పెను భారంగా పరిణమించింది. ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల పరిమాణం , ఆదాయం పెరిగినప్పటికీ, కస్టమర్లకు ఇస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు , నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ విభాగంలో నష్టాలు రూ.895 కోట్లకు పెరిగాయి. లాభార్జన మెరుగుపడకపోగా రోజురోజుకూ ఖర్చులు పెరుగుతుండటం సంస్థ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.
Also Read
ఈ వరుస నష్టాల నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలైన గోల్డ్‌మన్ శాక్స్, హెచ్ఎస్బిసి, సిటీ, జేపీ మోర్గాన్ వంటివి స్విగ్గీ షేర్ల లక్ష్య ధరను గణనీయంగా తగ్గించాయి. ఇన్‌స్టామార్ట్ నిరంతర నష్టాలే కంపెనీకి పెద్ద సవాలుగా మారాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారం పెరుగుతున్నప్పటికీ, లాభాలు రాకపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. రాబోయే రోజుల్లో స్విగ్గీ తన వ్యయాలను తగ్గించుకుని లాభాల బాట పట్టకపోతే మార్కెట్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
-
Swiggy shares: స్విగ్గీ షేర్లు ఢమాల్.. రికార్డు కనిష్టానికి పడిపోయిన షేర్లు.. కారణం ఏంటి..?
-
KTR: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం..!
-
Piyush Goyal: ‘కాలుష్యానికి కారణం మీరే.. భారత్‌పై నిందలేంటి?’.. యూరప్ కపటత్వాన్ని ముఖం మీదే బట్టబయలు..
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!