AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు.. ఇక, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు నగరి, పుంగనూరు, పుత్తూరు, కుప్పం, పలమనేరు, మదనపల్లె మున్సిపాలిటీల్లోనూ టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు.
తిరుపతి కార్పొరేషన్లో టీడీపీకి 38 డివిజన్లు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా జేబీ శ్రీనివాస్ 61,712 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 66 డివిజన్లకు గాను రెండు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన డివిజన్లలో టీడీపీ 36, జనసేన 19, బీజేపీ 3, వైసీపీ 3, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను గెలుచుకున్నారు. దీంతో తుది ఫలితాల్లో టీడీపీ 38, జనసేన 19, బీజేపీ 3, వైసీపీ 3, ఇండిపెండెంట్లు 3 డివిజన్లను కైవసం చేసుకున్నారు.
Also Read
- Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
- RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
- AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
చిత్తూరు కార్పొరేషన్లో రెండోసారి కఠారి హేమలత
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కఠారి హేమలత 35,050 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె రెండోసారి చిత్తూరు మేయర్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 60 డివిజన్లకు గాను 47 టీడీపీ, 2 జనసేన, ఒక బీజేపీ, ఒక వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 4, వైసీపీ 3, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకటి గెలుచుకున్నారు. తుది ఫలితాల్లో టీడీపీ 51, వైసీపీ 4, జనసేన 3, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని దక్కించుకున్నారు.
నగరిలో టీడీపీకి 32 వార్డులు
నగరి మున్సిపాలిటీ చైర్మన్‌గా శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 40 వార్డులకు గాను మూడు టీడీపీ, ఒక వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 29, జనసేన ఒకటి, వైసీపీ 6 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో తుది ఫలితాల్లో టీడీపీ 32, వైసీపీ 7, జనసేన ఒక వార్డును కైవసం చేసుకున్నాయి.
పుంగనూరులో నయీమ్ తాజ్ ఏకగ్రీవం
పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నయీమ్ తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 వార్డులకు గాను 27 టీడీపీ, 2 జనసేన, 2 బీజేపీ, ఒక ఎస్డీపీఐ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 3, సీపీఐ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. దీంతో తుది ఫలితాల్లో టీడీపీ 30, జనసేన 2, బీజేపీ 2, సీపీఐ ఒకటి, ఎస్డీపీఐ ఒక వార్డును గెలుచుకున్నాయి.
పుత్తూరులో జనసేన అభ్యర్థి ఎలుమలై విజయం
పుత్తూరు మున్సిపల్ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి ఎలుమలై 10,023 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గాను ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 29, వైసీపీ 4, జనసేన 2 స్థానాలను గెలుచుకున్నాయి. తుది ఫలితాల్లో టీడీపీ 30, వైసీపీ 4, జనసేన 2 వార్డులను కైవసం చేసుకున్నాయి.
కుప్పంలో మొత్తం 32 వార్డులు టీడీపీ ఖాతాలోకి
కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రాజ్‌కుమార్ 15,630 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 32 వార్డులకు గాను 13 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో కుప్పం మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులూ టీడీపీ ఖాతాలో చేరాయి.
పలమనేరులో టీడీపీకి 26 వార్డులు
పలమనేరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి 3,475 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 36 వార్డులకు గాను ఆరు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 20, వైసీపీ 8, జనసేన 2 స్థానాలను గెలుచుకున్నాయి. తుది ఫలితాల్లో టీడీపీ 26, వైసీపీ 8, జనసేన 2 వార్డులను దక్కించుకున్నాయి.
మదనపల్లెలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చిన్నబాబు గెలుపు
మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ చిన్నబాబు 9,027 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 48 వార్డులకు గాను ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన వార్డుల్లో టీడీపీ 21, జనసేన 6, వైసీపీ 12, బీజేపీ 4, స్వతంత్రులు 3, బీఎస్పీ ఒక స్థానాన్ని గెలుచుకున్నారు. తుది ఫలితాల్లో టీడీపీ 22, వైసీపీ 12, జనసేన 6, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3, బీఎస్పీ ఒక వార్డును కైవసం చేసుకున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!