Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
- బాతు గుడ్లనుకుని పొదిగితే నెమళ్లు
- ఫామ్ హౌస్‌లో నాలుగు నెమళ్ల పెంపకం
- నెమళ్లను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ
- వన్యప్రాణులు కనిపిస్తే ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్యప్రాణులు లేదా వాటి గుడ్లు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోనో, వ్యవసాయ క్షేత్రాల్లోనో కనిపించినప్పుడు వాటిని సొంతంగా పెంచడం లేదా దాచుకోవడం పెద్ద నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన ఘటన ఇందుకు ఒక స్పష్టమైన నిదర్శనం. బాతు గుడ్లనుకుని పొదిగించిన నెమలి పిల్లలు పెద్దవయ్యాక నెమళ్లని తెలిసినా, అటవీశాఖ అధికారులకు చెప్పకుండా అక్కడే ఉంచుకోవడం చట్టవిరుద్ధంగా మారింది.
అనుకోకుండా పొదిగినా.. దాచుకోవడం తప్పు
రంగాపల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో దొరికిన గుడ్లను బాతు గుడ్లుగా భావించి సూపర్వైజర్ బాతు గుడ్లతో కలిపి పొదిగేందుకు పెట్టారు. దాదాపు మూడు నెలల తర్వాత గుడ్లు పగిలి బయటకు వచ్చినవి నెమలి పిల్లలని తెలిసింది. అయినప్పటికీ వాటిని అటవీశాఖకు అప్పగించకుండా, సమీపంలోని అడవిలోనూ వదలకుండా ఫామ్ హౌస్‌లోనే పెంచుతూ వచ్చారు. ఇలా మొత్తం నాలుగు నెమళ్లను తన వద్ద ఉంచుకున్న సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సూపర్వైజర్ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం అప్పగించారు.
Also Read
- Illandu Missing Person : ఇల్లందులో 45 రోజులుగా కనిపించని వ్యక్తి.. వీడని మిస్టరీ
- Nitin Nabin : తెలంగాణకు నితిన్ నబీన్.. రెండు పాదయాత్రల ప్లాన్
- CM Revanth Reddy : అమిత్ షాకు రేవంత్ రెడ్డి సవాల్.. ఓవైసీపై పోటీ చేయగలరా.?
- Illegal Egg Donation Case : అండాల అక్రమ దందాలో మరో ట్విస్ట్.. ఒక్కో అండం రూ.3 లక్షలకు విక్రయం
జాతీయ పక్షిని పెంచితే చట్టపరమైన చర్యలు తప్పవు
నెమలి మన భారత జాతీయ పక్షి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నెమలిని అనుమతులు లేకుండా బంధించడం, ఇంట్లో లేదా ఫామ్ హౌస్‌లో పెంచడం, లేదా తరలించడం కఠినమైన నేరం. తెలియక గుడ్లు పొదిగినా, లేదా పిల్లలు నెమళ్లని గుర్తించిన వెంటనే సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. సొంతంగా పెంచాలని ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వన్యప్రాణులు కనిపిస్తే ఏం చేయాలి?
పొలాలు, ఫామ్ హౌస్‌లు లేదా నివాస ప్రాంతాల్లోకి నెమళ్లు లేదా ఇతర వన్యప్రాణులు, వాటి గుడ్లు వచ్చినప్పుడు వాటిని ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండాలి. సొంతంగా దాణా వేసి బంధించడం లేదా అడవిలోకి తీసుకువెళ్లి వదిలేయడం వంటివి చేయకుండా, వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలి. వన్యప్రాణులను రక్షించడం మన అందరి బాధ్యతని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!