చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. లేని సమస్యలు సృష్టించి మరీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను సభ రాకుండా అక్రమ కేసుకు పెడుతారా.. వైసీపీ దొంగల్లారా… తాను కనుకగా కన్నెర్ర చేస్తే ఇంటిలో నుండి బయటకు కూడా రాలేరన్నారు.…