Crime News: ఆడపిల్ల పుట్టిన దగ్గరనుంచి తండ్రి ఒడిలో.. పెద్దది అయ్యాకా తల్లి పెంపకంలో, పెళ్లి తరువాత భర్త నీడలో.. ఉండాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆడపిల్లకు మంచి ఏంటి..? చెడ్డ ఏంటి..?.. సమాజం ఎలా ఉంది.. ఆమె శరీరంలో వచ్చే మార్పులు.. వాటికి కారణాలు.. అన్ని తల్లి దగ్గర ఉండి నేర్పిస్తుంది. తండ్రి ఎంత దగ్గర అయినా.. కొన్ని విషయాలు ఏ ఆడపిల్ల తండ్రికి చెప్పదు. ఏ తండ్రి.. ఆ విషయాలను కూతురును అడగలేడు. అలా అడగకపోవడమే తన కూతురుకు ఇలాంటి గతి పట్టిందని ఒక తండ్రి కుమిలిపోతున్నాడు. చిన్నతనంలోనే తల్లి.. వదిలేసి వెళ్ళిపోతే.. ఆమె తింటుందా..? లేదా అనేది మాత్రం అడగగలిగాను కానీ, రక్తస్రావం అవుతుందా..? పెద్దదానివి అయ్యావా..? అని అడగలేకపోయాయని.. దానివలనే ఎవడో ఒకడు తన కూతురును తల్లిని చేశాడని వాపోయాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ లో వెలికి చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమృత్సర్ జిల్లా ఫగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 12 ఏళ్ళ చిన్నారి.. తన తండ్రితో నివసిస్తుంది. ఆమె తల్లి చిన్నప్పుడే వదిలి వెళ్లిపోవడంతో.. ఆమె తండ్రి వద్దనే ఒంటరిగా ఉంటుంది. ఇక గత 7 నెలలుగా చిన్నారికి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండగా.. అది సాధారణమైన కడుపునొప్పి అని అనుకోని తండ్రి నార్మల్ మందులు ఇవ్వడం, కొద్దిసేపు ఉపశమనం ఇచ్చి.. ఆ తరువాత మళ్లీ కడుపునొప్పి రావడం జరుగుతుండేది. ఇంకా బిడ్డ నొప్పి నొప్పి అని అంటుండగా.. తండ్రి గురునానక్ దేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించగా.. ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పడంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేసి.. 800 గ్రాముల బరువున్న పాప ను బయటకు తీశారు. కానీ, అవాంఛిత గర్భం కావడంతో చిన్నారి, బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు దీనికి కారణం ఎవరు..? అని తండ్రిని అడుగగా.. ” నాకేం తెలియదు.. ఆడపిల్లను అలాంటి ప్రశ్నలు వేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. తల్లి ఉంటే ఆమె చూసుకొనేది. నా కూతురు ఎప్పుడు పెద్దది అయ్యిందో కూడా నాకు తెలియదు.. ఎదిగే కూతురును ఏమి అడగాలో కూడా తెలియదని ” కంటనీరు పెట్టుకున్నాడు. ఇక నిదానంగా చిన్నారిని విచారించగా.. ఒకరోజు.. బహిర్భుమికి వెళ్లివస్తుండగా.. కొంతమంది తనపై అత్యాచారం చేసారని, ఆ తరువాత కొన్నిరోజులకు ఇలా కడుపునొప్పి రావడం మొదలుపెట్టిందని, అయితే అది గర్భం అని తనకు తెలియదని ఏడ్చింది. ఇలా తనపై అత్యాచారం జరిగిందని తండ్రికి ఎలా చెప్పాలో తెలియలేదని ఆమె వాపోయింది. వైద్యుల చొరవతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ చిన్నారి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను వదిలి మరో బిడ్డకు తల్లి అయ్యేలా చేశావే.. నువ్వసలు తల్లివేనా..? నాటు కామెంట్స్ చేస్తున్నారు.