Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ బరిలో బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న వేళ, ఒక చిన్న సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది. విభిన్నమైన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత వేణు దోనేపూడి.. ఈ సినిమాను థియేటర్లలో చూసే ప్రేక్షకులకు ఏకంగా ఉచితంగా ‘మేఘాలయ ట్రిప్’ తీసుకెళ్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజువల్స్ పట్ల మేకర్స్ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 28 రోజుల పాటు పూర్తిగా మేఘాలయలోని ఎవరూ చూడని, అత్యద్భుతమైన లొకేషన్లలో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. ఇలా ఒక తెలుగు సినిమాను ఆసాంతం మేఘాలయలో చిత్రీకరించడం బహుశా ఇదే తొలిసారి. విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రకృతిని చూపిస్తూ స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే అక్కడ షూట్ చేసినట్లు నిర్మాత వెల్లడించారు. మేఘాలయ సీఎం కాన్రాడ్ కె.సంగ్మా, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తమకు ఇచ్చిన పూర్తి మద్దతు వల్లే ఇది సాధ్యమైందని ఆయన గుర్తుచేసుకున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ఒక ప్రత్యేక కాంటెస్ట్ ద్వారా ప్రేక్షకులను మేఘాలయకు పంపనున్నారు.
Also Read
హీరో, హీరోయిన్, విలన్ అనే రొటీన్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రతి పాత్రకూ ఎంతో ప్రాధాన్యత ఉండేలా ఈ కథను అల్లుకున్నారు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయె పూర్తిస్థాయి పాత్రలో నటించడం విశేషం. ట్రైలర్ లాంచ్ వేదికపై ఆయన మాట్లాడుతూ.. తన సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి తనను పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పాత్ర కంటే కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, దర్శకుడు గుణి చెప్పిన పాయింట్ నచ్చడంతోనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు స్పష్టం చేశారు. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, నేపాల్ నటి సమృద్ధి ఆర్యాళ్, మాల్వీ మల్హోత్రా, టిను ఆనంద్, జార్జ్ మరియన్ తదితరులు తమ సహజమైన నటనతో అలరించారు.
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!