ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు.…
AP DGP Rajendranath: ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందన్నారు. లోక్ అదాలత్‌లో 57 వేల కేసులను పరిష్కరించామని.. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని తెలిపారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2గా ఉందని.. మహిళలపై అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని డీజీపీ వివరించారు. 88.5 శాతం కేసుల్లో…
ఏపీ డీజీపీని కలిశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. సంకల్ప సిద్ధి చీటింగ్ కేసుతో కొడాలి నానికి, తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. టీడీపీలో ఉంటే మంచోళ్లు.. లేకుంటే కాదా? అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేశారని, పట్టాభి, బచ్చుల అర్జునుడిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు..…
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్ వర్సెస్ పోలీసుగా మారిపోయిందట పరిస్థితి.. జిల్లా ఎస్పీలకు కొన్ని విషయాల్లో నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట.. అయితే, ఈ వ్యవహారం పోలీస్ బాస్‌కు రుచించడంలేదు.. జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి… ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంటూ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్…