Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది…
Sajjala Ramakrishna Reddy comments on polavaram Height:పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వాదన అసంబద్ధంగా ఉందన్నారు. భద్రాచలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రత్యేక ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే డిజైన్లు ఖరారు చేశారని సజ్జల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ…
Minister Ambati Rambabu comments on polavaram project height: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టుపై వివాదం చెలరేగింది. గోదావరి వరదలకు భద్రాచలం మునిగిపోవడంతో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ఎత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను ఏపీలో కలపడాన్ని తప్పుబట్టారు. దీంతో మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పోలవరంపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నవాళ్లు…
Kakinada YSRCP MP Vanga Geetha comments on polavaram project: తెలంగాణలోని భద్రాచలం ముంపునకు కారణం పోలవరం ప్రాజెక్టేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత ఖండించారు. గోదావరి వరద కేవలం ఒక్కచోటనే రాలేదని… మహారాష్ట్రలో కూడా వరద వచ్చిందని ఎంపీ వంగా గీత వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు మాత్రమే వరదకు కారణం అవుతున్నాయని.. ఇలాంటి కామెంట్లను తాము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. 1986 తర్వాత…
Botsa Satyanarayana comments on polavaram project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దాన్ని ఎవరూ మార్చలేదన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. విభజన చట్ట…