Cement Rates Effect: మండుతున్న సిమెంట్.. నిర్మాణరంగానికి గడ్డురోజులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాణారంగానికి ప్రధానంగా అవసరమయిన సిమెంట్ మంట పెడుతోంది. ధరలు భగ్గమంటున్నాయి. ఈ నెలలోనే మరో 50 రూపాయల వరకు ధర పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీగా ఉన్న సిమెంట్ ధరలతో ఇంటి నిర్మాణం తడిసి మోపెడవుతోంది. సిమెంట్ ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నెలలోనే బస్తాపై 25 నుంచి 50 రూపాయల వరకు పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే బొగ్గు, పెట్రోలియం కోక్ గత 6 నెలల్లో 30 నుంచి 50 శాతం పెరిగాయి. దీంతో సిమెంట్ ధరలు కూడా భారీగా పెరగొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా బొగ్గు, పెట్‌కోక్, పెట్రోలియం దిగుమతుల భారం పెరుగుతోంది. ప్రస్తుతం బస్తా సిమెంట్ బ్రాండ్ ను బట్టి 350 నుంచి 450 రూపాయల వరకు ఉంది. ఈ నెలలోనే మరో 25 నుంచి 50 రూపాయలు పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది.
మార్చి క్వార్టర్లో పెట్ కోక్ ధరలు అంతర్జాతీయంగా 43 శాతం పెరిగాయి. దేశీయ పెట్ కోక్ ధరలు మార్చిలో 26 శాతం, ఏప్రిల్‌లో 21 శాతం మేర పెరిగాయి. పెట్‌కోక్ దిగుమతి వ్యయం ఏడాది క్రితంతో పోలిస్తే ఒక్కో టన్నుపై 130 డాలర్ల మేర పెరిగింది. ఆస్ట్రేలియాలో వాతావరణం అనుకూలించక, ఇండొనేషియాలో నిషేధం వల్ల బొగ్గు ఎగుమతులు తగ్గాయి. దీంతో ధర పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 115 డాలర్ల వరకు పెరిగింది. ఇండియాలో బల్క్ డీజిల్ లీటర్‌పై 25 రూపాయలు పెంచారు.
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
రిటైల్ ధర కూడా మార్చి నుంచి 10 రూపాయల వరకు పెరిగింది. సిమెంట్ రవాణా 50 శాతం వరకు రోడ్లపైనే జరుగుతోంది. పెరిగిన డీజిల్ ధరల కారణంగా రవాణా ఖర్చులు, పెట్‌కోక్, బొగ్గు ధరల పెరుగుదల కారణంగా ఉత్పత్తి, ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ వినియోగం 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. దేశీయ సిమెంటు వినియోగంలో 60 శాతం ఇళ్ల నిర్మాణానికే వెళ్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్‌లో సిమెంట్‌కు 20 శాతం గిరాకీ పెరిగింది. అయితే సెకండాఫ్‌లో అకాల వర్షాలు, ఇసుక, కూలీల కొరతతో 7 శాతం మేర తగ్గింది. అయితే ఈసారి నిర్మాణ ఖర్చు భారీగా పెరగడంతో… సిమెంట్ గిరాకీ తగ్గొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
Read Also: New Crime: వెలుగులోకి కొత్త తరహా మోసం.. మీకు తెలియకుండానే బ్యాంకులో అప్పులు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!