Boyfriend Attacked On Girlfriend Parents For Not Accepting Their Marriage In Tirupati: ఈరోజుల్లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తాము ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని యువతిపైనే దాడి చేయడమో, లేకపోతే తమ పెళ్లికి అంగీకరించడం లేదని పెద్దలపై ఎటాక్‌కి దిగడం లాంటివి చేస్తున్నారు. తమకు దక్కనిది వేరే వాళ్లకు దక్కకూడదని ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తిరుపతి జిల్లాలోనే అలాంటి దారుణమే వెలుగుచూసింది. తమ ప్రేమ వివాహానికి అంగీకరించడం లేదని, ప్రియురాలి తల్లిదండ్రులపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kakinada Crime: కాకినాడలో దారుణం.. ఆటో ఆపి, మహిళను హత్య చేసి..
తిరుపతి జిల్లాలోని డక్కిలిలో ఉంటున్న ఓ యువకుడు కొంతకాలం నుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ యువతి కూడా అతడ్ని ప్రేమిస్తోంది. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇద్దరి అభిరుచులు కలవడం, ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతుండటంతో.. పెళ్లితో ఒక్కటి అవ్వాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలియజేశారు. అయితే.. ప్రియురాలి తల్లిదండ్రులు మాత్రం వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు. కారణం తెలీదు కానీ.. ఆ అబ్బాయితో పెళ్లి చేసేందుకు యువతి పేరెంట్స్ ససెమిరా అనేశారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
ఆ తల్లిదండ్రుల్ని ఒప్పించేందుకు యువతితో పాటు యువకుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో.. యువకుడు వారిపై కక్ష పెంచుకున్నాడు. తమ వివాహానికి అడ్డుగా ఉన్నారని భావించి, వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. కత్తి తీసుకుని వారిద్దరిపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తండ్రికి తీవ్ర గాయాలవ్వడంతో.. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.