Tirupati Crime: తిరుపతి సమీపంలోని దామినేడులోని ఓ ఇంట్లో కుళ్లిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ మృతదేహాలుగా పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం ఇరువురు కూడా వివాహేతర సంబంధంతో సొంత ఊరిని వదిలి తిరుపతికి వచ్చి ఇక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. ఏం జరిగిందో ఏమో.. కానీ, గత నెల 22వ తేదీ నుండి ఇంటి నుండి బయటకు రాలేదు.. ఇంటి…
తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానిక ఇంద్ర ప్రియదర్శిని కూరగాయలు మార్కెట్లో మత్తు ఎక్కించే ఇంజక్షన్లు వీడియో వైరల్ అవుతోంది. ఇంజక్షన్ లను తీసుకునే సమయంలో యువకులు వీడియో తీశారు. కూరగాయల మార్కెట్ లో తరచూ మత్తులో ఉంటూ యువకులు హల్ చల్ సృష్టిస్తున్నారు. తిరుపతి నగరంలో విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. యువత స్వయంగా మత్తు ఇంజక్షన్లు వేసుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది.