Two Thieves Killed Woman And Escaped With Auto In Kakinada: కాకినాడలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. దొంగతనం కోసం ఓ ఆటో ఆపిన ఇద్దరు దొంగలు.. అందులో ప్రయాణిస్తున్న మహిళను హత్య చేశారు. అనంతరం ఆటోని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకొనేరు వద్ద జాతీయ రహదారిపై సత్యవతి అనే మహిళ ఒక ఆటోలో ప్రయాణిస్తోంది. అప్పటికే అక్కడ మాటు వేసిన ఇద్దరు దొంగలు.. సడెన్‌గా అడ్డుకొని, ఆటోని ఆపారు. ఆపై డబ్బులు ఇవ్వాలని ఆ మహిళను, ఆటో డ్రైవర్‌ని బెదిరించారు. లేకపోతే చంపేస్తామని కత్తి చూపిస్తూ బెదిరించారు.
Tomatoes Tulabharam: ఇదేందయ్యో ఇది.. టమాటాలతో తులాభారం! ఎక్కడో తెలుసా?
అయితే.. ఆ మహిళ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ దొంగలను ఎదురుతిరిగింది. దీంతో కోపాద్రిక్తులైన ఆ దొంగలు.. కత్తితో ఆమెపై దాడి చేశారు. విచక్షణారహితంగా ఎటాక్ చేసి, హత్య చేశారు. అంతేకాదు.. ఆటో డ్రైవర్‌పై కూడా దాడి చేశారు. ఆపై ఆటోతో ఆ ఇద్దరు దొంగలు పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆటో డ్రైవర్‌ని స్థానికులు గుర్తించి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ హత్య వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?