గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.
బెజవాడలో గంజాయి, బ్లెడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది.. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఏడో తరగతి విద్యార్థిని అడ్డగించిన బ్లేడ్ బ్యాచ్… బ్లేడు చూపిస్తూ.. విద్యార్థిని బెదిరించింది.. డబ్బులు కావాలని దాడికి దిగింది.. దాంతో భయంతో వణికిపోయిన ఆ విద్యార్థి వారి నుండి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి పరుగులు పెట్టాడు.. జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో పక్క…