టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలాకాలంగా జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నాడు. యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో ధావన్‌కు తుది జట్టులో ప్లేస్ దక్కడం చాలా కష్టంగా మారిపోయింది. తాజాగా ఇదే విషయమై స్పందించాడు శిఖర్. జీవితంలో ఇలాంటి ఎత్తు పల్లాలు సహజమని తెలిపిన అతడు.. తనకంటే మెరుగైన ఆటగాడు రావడంతో జట్టులో చోటు కోల్పోయానని స్పష్టం చేశాడు. మళ్లీ జట్టులోకి వస్తాననే నమ్మకం తనకు ఉందని, దాని కోసం కష్టపడుతున్నానని చెప్పాడు.
Also Read: Hardik-Natasha: రెండోసారి పెళ్లి..ఫుల్లుగా తాగి చిందేసిన హార్దిక్-నటాషా
“లైఫ్‌లో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాయి. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నాకు జట్టులో చోటు దక్కలేదు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను. జట్టుకు దూరమైన కాలంలో మానసికంగా నేను మరింత ధృడంగా మారాను. చోటు కోల్పోవడాన్ని నెగెటివ్‌గా తీసుకోవడం లేదు. నాకంటే బాగా ఆడుతున్నారు కాబట్టే కొందరు టీమ్‌లో ఉన్నారు. నేను జట్టు నుంచి దూరమయ్యాను. రీఎంట్రీ ఇవ్వడానికి ఇంకా దారులు మూసుకుపోలేదు. ఇప్పటికీ అవకాశం ఉంది. తప్పకుండా ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియా తరఫున అడుతాను” అంటూ శిఖర్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Womens T20 WorldCup: ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
శిఖర్ ధావన్ గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌కు కూడా గిల్ ఓపెనర్‌గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం గిల్ చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. నవంబర్‌లో భారత్ జట్టుకు సారథిగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టును నడిపించిన ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో డిసెంబరులో జరిగిన సిరీస్‌లోనూ ఆడాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్‌ను పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న ఇతడు.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు.
Also Read: Adipurush: ఇది దేశం గర్వించే సినిమా అవుతుంది- కృతి సనన్