Kanna Lakshminarayana’s resignation from BJP: ఆంధ్రప్రదేశ్‌లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్ షాక్ తగిలింది.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు.. తన నివాసంలో ఇవాళ ముఖ్యఅనుచరులతో సమావేశమైన కన్నా.. పార్టీలో గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేక పోతున్నా.. అందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించారు. దీంతో, కన్నా నిర్ణయాన్ని ఆహ్వానించారు ఆయన అనుచరులు.. కన్నా వెంటే తమ ప్రయాణం అంటూ.. కన్నాకకు మద్దతుగా నినాదాలు చేశారు..
Read Also: Jyothula Chanti Babu: ఎన్టీఆర్‌ని మింగేసిన అనకొండ చంద్రబాబు.. నమ్మి మోసపోయిన వాళ్లలో నేను ఒకడిని..
బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా పంపించినట్టు వెల్లడించారు.. 2014లో మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలోకి వచ్చా.. కానీ, సోమువీర్రాజు ఏపీ బీజేపీ అధ్‌యక్షడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయి.. సోము వీర్రాజు పార్టీని సొంత సంస్థలాగా నడుపుతున్నారని ఆరోపణలు గుప్పించారు.. పార్టీలో చర్చించకుండా ఎంపీ జీవీఎల్ సొంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన కన్నా.. కేవలం సోము వీర్రాజు వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా ముందు ప్రకటించారు.. అయితే, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరో 15 మంది నేతలు కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. అయితే, బీజేపీలోకి వస్తూనే రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేపట్టారు కన్నా లక్ష్మీనారాయణ.. కానీ, కన్నాకు పగ్గాలు అప్పజెప్పండం ఆది నుంచి సోమువీర్రాజుకు ఇష్టంలేదు.. సీనియర్లను వదిలి.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి పదవులు ఏంటి? అనే బహిరంగంగానే ఆయన ప్రశ్నించారు.. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. సోమువీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారు.. కానీ, ఈ ఇద్దరు నేతల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది.. ఇప్పుడు ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పే వరకు వెళ్లింది. అయితే, తన రాజకీయ భవిష్యత్‌పై కన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..