Railway Development: ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి అదనపు నిధులు.. రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Development: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి సాధిస్తుందని ప్రశంసలు కురిపించారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేసిన స్టీల్ బెంచిలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి సాధిస్తున్నారు.. గుంటూరు రైల్వే స్టేషన్ ను రాబోయే రోజుల్లో 20 కోట్ల రూపాయాలతో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. గుంటూరు, గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులు 2025 నాటికి పూర్తి అవుతాయని వెల్లడించిన ఆయన.. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్ వల్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు.. ఇక, వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఆంధ్రప్రదేశ్లో రైలు పండుగ జరుగుతుందన్నారు.. రైల్వే ప్రయాణ సౌకర్యం కోసం ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించినట్టు వెల్లడించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైల్ పరుగులు పెడుతోన్న విషయం విదితమే.. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే.
Read Also: Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!