Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్‌జాన్’కు ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Look: బాలీవుడ్ కండల వీరుడు, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన భాయ్‌జాన్ తలపై క్యాప్ ధరించి కనిపించారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోల్లో సల్మాన్ ఖాన్ గతంతో ఉన్నంత ఎనర్జీతో, స్టైల్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే కాస్త నీరసంగా, వయసు పైబడినట్లుగా కనిపించడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వీడియోపై సోషల్ మీడియాలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఇది వయసు ప్రభావం కావచ్చని కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మార్పుపై సల్మాన్ ఖాన్ లేదా ఆయన టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఏది ఏమైనా దాదాపు మూడు దశాబ్దాలుగా తన ఫిట్నెస్, స్టైలిష్ లుక్స్, సిక్స్‌ప్యాక్ బాడీతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్‌ను ఇలాంటి రూపంలో చూడటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆందోళన కలిగిస్తోంది.
Also Read
సల్మాన్ ఖాన్‌కి ఏమైంది?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా లుక్కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో సల్మాన్, వయసు పైబడినట్లుగా, నీరసంగా ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది కొత్త సినిమా కోసం మేకోవరా లేక వయసు ప్రభావమా అని నెటిజన్లు చర్చిస్తున్నారు. తమ… pic.twitter.com/Tf5lnNBmwM
— ChotaNews App (@ChotaNewsApp) July 19, 2026
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!