Vishnu Kumar Raju: విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్.. అది అనివార్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై రాష్ట్ర నాయకత్వం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందన్న ఆయన.. అందుకు ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు.. వైసీపీతో ఉన్నామనే అభిప్రాయం కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు కుమార్ రాజు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
రాష్ట్ర, కేంద్ర అధిష్టానం ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాలని సూచించారు విష్ణకుమార్ రాజు.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యంగా పేర్కొన్నారు. ఒత్తిళ్ళు, ప్రలోభాలు పెట్టినా వైసీపీని ఆదరించకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శనంగా అభివర్ణించారు. మరోవైపు.. తెలంగాణలో బీజేపీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని ప్రశంసలు కురిపించారు. పొలిటికల్ వ్యాక్యూ మ్ ను తెలంగాణ బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. ఏపీలోనే టీఎస్ మోడల్ విధానాలు బీజేపీ ఎదుగుదలకు అవసరం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, జనసేనతోనే మా పొత్తు.. టీడీపీ, వైసీపీతో ఎలాంటి పొత్తులు ఉండబోవు అంటూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు, పలు సందర్భాలో స్పష్టం చేశారు.. కానీ, జనసేన, బీజేపీ.. తెలుగు దేశం కలిసి పని చేయాలంటూ విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!