Ashok Gajapathi Raju: వెనుకబడిన వర్గాలకు, మహిళలకు.. టీడీపీ అవకాశాలిచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju On 40 Years Of TDP: తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో.. నేటికీ అలాగే నడుస్తోందన్నారు. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేకసార్లు అధికారంలోకి వచ్చామని, ప్రతిపక్షంలోనూ ఉన్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు, మహిళలకు టీడీపీ అవకాశాలు కల్పించిందని చెప్పారు. భాషని, సంస్కృతిని కాపాడటంలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషించిందని.. అనేక ఉద్యమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపట్టిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ గేర్లో వెళుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డబ్బుల్ని కూడా నొక్కేస్తున్నారు అశోక్ గజపతి రాజు ఆరోపించారు. వికేంద్రీకరణ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పన్నులుతో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోందని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి నియంత చట్టాలను తీసుకొస్తున్నారని.. జీవో నం.1తో ప్రతిపక్షాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని, ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్లే రాష్ట్రం దేశంలోనే వెనుకబడిపోయిందని చెప్పారు. నిధుల్ని పక్కదారి పట్టిస్తూ, నీతులు చెప్పడం విడ్డూరమన్నారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికపై మాట్లాడుతూ.. ఆ ఇద్దరిపై విమర్శలు చేసిన మంత్రులకు విజ్ఞత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అశోక్ గజపతి రాజు కౌంటర్ వేశారు. పవన్, చంద్రబాబు కలవడం ఇదేం మొదటిసారి కాదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పనులుపై తామెప్పుడూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమీ ముందుకు సాగడం లేదని ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..