AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP, Jana Sena, BJP Seat-Sharing Update: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అర్ధరాత్రి వరకు జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్లాలని, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలు నిర్ణయించారు.
కార్పొరేషన్లలో ఎవరికి ఎన్ని స్థానాలు?:
స్థానిక ఎన్నికల్లో కార్పొరేషన్ల వారీగా సీట్ల పంపకంపై కూటమి నేతలు ప్రధానంగా చర్చించారు. 17 కార్పొరేషన్లలో టీడీపీ 12, జనసేన 4, బీజేపీ ఒక కార్పొరేషన్లో పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ, విజయవాడ, తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీకి రాజమండ్రి కార్పొరేషన్ కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడి కానున్నాయి.
Also Read
- India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
20కి పైగా మున్సిపాలిటీల్లో జనసేనకు అవకాశం?:
కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లోనూ జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చలు జరిగాయి. పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, తుని, అమలాపురం, మండపేట, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, జగ్గయ్యపేట, రేపల్లె, తెనాలి, పొన్నూరు, నరసరావుపేట, సత్తెనపల్లి, దర్శి, కావలి, మదనపల్లి, పుట్టపర్తి తదితర మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మున్సిపాలిటీల్లో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ పరిస్థితులపై కూటమి నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని మున్సిపాలిటీల్లో అవకాశం కల్పించాలనే అంశంపై తుది నిర్ణయం అధికారిక ప్రకటనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీజేపీకి రాజమండ్రి కార్పొరేషన్?:
కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఒక కార్పొరేషన్తో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. రాజమండ్రి కార్పొరేషన్లో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అలాగే యలమంచిలి, బాపట్ల, శ్రీకాళహస్తి, ఎర్రగుంట్ల, గూడూరు మున్సిపాలిటీల్లోనూ బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాలని కూటమి నేతలు చుస్తున్నారు. సీట్ల సర్దుబాటులో స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకంపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..