OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- మన్యం తొలి జడ్పీ చైర్పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న అనేకమంది నేతలు
- చైర్పర్సన్ పదవి ఎస్టీకి రిజర్వేషన్ కావడంతో తారుమారైన లెక్కలు
- జడ్పీ చైర్మన్ రేసులో ముందుంటాననుకున్న దత్తి లక్ష్మణరావు
- ఎస్టీకి రిజర్వేషన్ కావడంతో తీవ్ర నిరాశకు గురైన బీసీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఆ జిల్లా టీడీపీలో లోకల్ బాడీ రిజర్వేషన్లు కొత్త ఈక్వేషన్స్‌కు కారణమయ్యాయట. ఇప్పటిదాకా పదవి తమదేనని ధీమాగా చెప్పుకున్న నేతలు రిజర్వేషన్ తమకు వ్యతిరేకంగా రావడంతో నీరుగారిపోయారట. పీఠంపై బాసింపట్టు వేసుకుని కూర్చుందామనుకుంటే… ఇలా అయిందేంటని బాధపడుతున్నారట. రిజర్వేషన్ కలసి రాకపోవడంతో లోలోపల రగిలిపోతున్నారట. పార్వతీపురం మన్యం జిల్లా గతంలోనే ఏర్పాటైనప్పటికీ… జిల్లా పరిషత్‌ను మాత్రం ఈ మధ్యే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తొలి జడ్పీ చైర్పర్సన్ పదవిపై టీడీపీలోని అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారట. జిల్లాకు మొట్టమొదటి జడ్పీ చైర్పర్సన్ ఎవరు అయితే… వారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే అనేకమంది నాయకులు జడ్పీ పీఠం దక్కించుకోవాలనుకున్నారట. సామాజిక సమీకరణాలపై లెక్కలు వేసుకున్నారు. అధిష్టానం ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేశారు. తమ రాజకీయ భవిష్యత్తుకు ఈ పదవి కీలకమని భావించి ఎవరికి వారు తమ ప్రయత్నాలు సాగించారు. దాంతో పార్వతీపురం మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవి టీడీపీలో అంతర్గత రాజకీయాలకు కేంద్రంగా మారిందన్న మాటలు వినిపించాయి.
అయితే జడ్పీ చైర్పర్సన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ ఖరారు కావడంతో ఇప్పటిదాకా సాగిన లెక్కలు ఒక్కసారిగా తలకిందలయ్యాయట. జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం నాయకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా… ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదన్న అసంతృప్తి జిల్లాలోని కొందరు నేతల్లో ఉందట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో జడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు మరింత పెరిగాయని పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన దత్తి లక్ష్మణరావు జడ్పీ చైర్మన్ రేసులో తాను ముందుంటానని ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. పార్టీ కోసం పనిచేసిన లక్షణరావుకు తనకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన వర్గం భావించిందట. అయితే జడ్పీ చైర్పర్సన్ పదవి ఎస్టీకి రిజర్వేషన్ కావడంతో బీసీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారట. ఇదే సమయంలో వీరేష్ చంద్రదేవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేశానన్న భావనలో వీరేష్ చంద్రదేవ్ వర్గం ఉందట. రిజర్వేషన్ ఖరారుకు ముందు వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయని… కొందరు నాయకులు తమ అభిప్రాయాలను పెద్దల దృష్టికి తీసుకెళ్లారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ వర్గానికి చెందిన నేతలు ఆశలు పెట్టుకున్న సమయంలో ఎస్టీ రిజర్వేషన్ రావడంపై భిన్నమైన మాటలు వినిపిస్తున్నాయట.
Also Read
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- OTR : విజయనగరం టీడీపీలో మేయర్ సీటు ఎవరిదో..అధిష్టానం మనసులో ఉన్నదెవరు?
ఈ రిజర్వేషన్ నిర్ణయం వెనుక కొందరు నేతల ప్రయత్నాలు ఉన్నాయన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. రిజర్వేషన్ ఖరారు అనేది అధికారిక నిబంధనలు, సంబంధిత ప్రక్రియల ప్రకారం జరిగే అంశం కావడంతో రాజకీయ ఆరోపణలకు, వాస్తవాలకు మధ్య స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ తేజోవతి సహా పలువురు ఎస్టీ నాయకుల పేర్లు జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థుల రేసులో ఉన్నాయట. మండల స్థాయి నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ జడ్పీ చైర్మన్ పదవికి పోటీ ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుంది..? సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం, స్థానిక నాయకుల మధ్య సమన్వయానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది..? అనేది చర్చనీయాంశంగా మారింది. వీరేష్ చంద్రదేవ్‌కు పార్టీ పెద్దల ఆశీస్సులున్నాయన్న ప్రచారం పార్టీలో జరుగుతోందట. స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయనకున్న పరిచయాలు, పార్టీలో ఆయనకున్న సంబంధాలు… ఈ చర్చకు ఆస్కారమిస్తున్నాయట. మొత్తంగా పార్వతీపురం మన్యం జిల్లా జడ్పీ చైర్పర్సన్ పదవి రిజర్వేషన్ టీడీపీలో కొత్త చర్చకు కారణమైందట. ఒకవైపు పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు.. మరోవైపు మారిన రిజర్వేషన్ నేపథ్యంలో కొత్తగా తెరపైకి వస్తున్న పేర్లు. ఇంకోవైపు గ్రూపుల మధ్య సమన్వయం సాధించాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుంది..? స్థానిక సంస్థల ఎన్నికల వేళ నేతల మధ్య అసంతృప్తిని ఎలా అధిగమిస్తుంది..? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..