ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేలేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఇవాళ (శనివారం) పశ్యిమగోదావరి జిల్లా నరసాపురంలో డీజీపీ పర్యటించారు
సోషల్ మీడియా ద్వారా వేధింపులకు అడ్డుకట్ట పడాలన్నారు సీఎం జగన్.. దీనిపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.. ఇక, సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేశారు.. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్న ఆయన.. దీనిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఆలోచన చేయాలన్నారు..
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయితీ గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ నిర్మల దిశా యాప్ డౌన్లోడ్ చేసేందుకు గ్రామస్తులు వద్దకు వెళ్ళారు. గ్రామంలో ఉన్నవారి మొబైల్ కి దిశ యాప్ డౌన్లోడ్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఒడిశా సెల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఒడిశా సెల్ సిగ్నల్స్ తో యాప్ డౌన్లోడ్ అవ్వకపోతుండడంతో ఆమె తెలివిగా ఆలోచించింది. గ్రామానికి చాలా దూరంగా ఆంధ్రప్రదేశ్ సెల్ సిగ్నల్ ఎక్కడ వస్తుందో పరిశీలించి…
మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాం… దిశ యాప్ తో మహిళల దశ మారుతుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు వాహనాలు చెడిపోయినా దిశా యాప్ ను ఆశ్రయిస్తున్నారు… మహిళా రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం… కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎలాగో మా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసి ప్రజాగ్రహాన్ని టిడిపి చవిచూసింది. వైసీపీ…
మహిళల భద్రత కోసం దిశా చట్టాన్ని తీసుకుని వచ్చాం. ఈ చట్టం వచ్చిన తర్వాత విచారణ, శిక్ష ఖరారు వేగంగా జరుగుతోంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. 2019లో 100 రోజుల్లో విచారణ పూర్తి చేస్తే ఈ ఏడాదిలో 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసే పరిస్థితి ఉంది. 2,114 కేసులను 40 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు వాళ్ళు కూడా అమల్లోకి…
మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పై మరోమారు స్పందించిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. పక్కరాష్ట్రంలో దిశ ఘటనలో సీపీ సజ్జనార్ చేసిన ఎన్ కౌంటర్ ను అందరూ స్వాగతించాలి అన్నారు. అలాగే అమ్మాయిల శీలాన్ని చెరచిన వాడు మగాడు కాదు మృగాడు. సజ్జనార్ చేసిన పని సమాజం నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప పాలసీ. న్యాయానికి న్యాయం జరగనపుడు సమాజంలోంచి ఒక న్యాయం పుట్టుకొస్తుంది . అదే సమాంతర న్యాయం. సమాంతర న్యాయంలో నో లా,…