Minister Anitha: ఏపీకి ‘మొంథా తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేసింది. పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాయుగుండం తీవ్రతను, ప్రభావిత జిల్లాలు, ప్రాంతాల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది.. తీవ్ర తుపాను మారి ఈ నెల 27, 28, 29వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి అని అనిత తెలియజేసింది.
Read Also: Wife Attacked Husband: భార్య కొట్టిందని .. భర్త ఏం చేశాడో తెలుసా..
ఇక, తీర ప్రాంతం ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి అనిత ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రం పైకి వేటకు వెళ్లకుండా చూడాలని తెలిపింది. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పుకొచ్చింది. రైతులు కూడా వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండొద్దని పేర్కొనింది.