Farmers High Alert: దిత్వా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా మారి తుఫాన్‌గా మారిందని.. దానికి ‘దిత్వా’గా నామకరణం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 15 కిలో మీటర్ల వేగంతో కదులుతూ తుపాన్ ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)కు 200 కిలో మీటర్లు.. పుదుచ్చేరికి 610 కిలో మీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా సుమారు 700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.. Read…
CM Chandrababu: మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Minister Anitha: ఏపీకి 'మొంథా తుపాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేసింది.
IMD Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి, నేటి అర్థరాత్రి తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.…
హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు అని సూచించారు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది అని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొనింది. మధ్యాహ్నానికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.