ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న…
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఆర్యవైశ్యులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లిఖార్జునరావును వేధించడంతో హఠాత్తుగా చనిపోయారని విమర్శించిన ఆయన.. చంద్రబాబు నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారన్నారు.. ఇక, సొంత పార్టీలో ఉన్న శిద్ధా రాఘవరావును అవమానాలకు గురి చేశారని పేర్కొన్న మంత్రి వెల్లంప్లి… అమరజీవి…
రాసిపెట్టుకొండి వైఎస్ జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి తరం కాదని జోస్యం చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు త్వరగా ఎన్నికలొచ్చేయాలి…అధికారంలోకి వచ్చేయాలని తపన పడుతున్నారని సెటైర్లు వేశారు. మా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది.. ఉప ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్ని ఎన్నికలనూ ఎదుర్కొన్నాం.. ఒక్క ఎన్నికలోనైనా టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చిందా? అని ప్రశ్నించారు.. అన్నం తినేటప్పుడు ఎవడూ…
విజయవాడలోని పీడబ్ల్యూ గ్రౌండ్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని మంత్రుల బృందం సోమవారం సందర్శించింది. మంత్రులు పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ లతో పాటు అధికారులు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రలు మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిధులను గ్రీన్ ఛానల్ లో పెడతాం అని సీఎం హామీ ఇచ్చారని, 12.5 అడుగుల మోడల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 25 అడుగుల నమూనా విగ్రహం త్వరలో పెడతామని,…
రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నామని… దీనిపై పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి వున్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇక, అరసవల్లి సూర్యదేవుని జయంతి ఉత్సవాలును అధికారులు విజయవంతంగా నిర్వహించారిన ప్రశంసించారు.. మరోవైపు ముఖ్యమంత్రి…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని, జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు.. సీఎంను దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఒళ్లు దగ్గర…
ఏపీలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వంగవీటి రాధా రెక్కీ అంశంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని ఆయన అన్నారు. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలి, రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదు ఆయన అన్నారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని, చంద్రబాబు తప్పుడు…
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే…
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో…