రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు : పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారు. ఇది దురదృష్టకరం అని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలి. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని అడిగారు. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరం. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ చర్చపై వీడియో అందరి దగ్గరా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు.
వైసీపిని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజమేనని నమ్మారు. వారి బుర్రలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదేదో జరిగినట్టు నమ్మించే నేర్పరితనం చంద్రబాబు సొంతం. దుర్మార్గమైన రాజకీయ క్రీడకు చంద్రబాబు తెరతీశారు. చంద్రబాబు అనుభవానికి ఒక పరమార్ధం ఉండాలి. కానీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడతారని ఊహించలేదు. ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయ అంశాలపై చర్చ జరుగుతోంది. ఈలోపు జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఇలాంటి పనుల వల్ల రాష్ట్ర రాజకీయాలను ఎలాంటి పరిస్థితులకు తీసుకుని వెళ్తున్నారు. వైసీపి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల విజయంపై వైసీపి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తోంది. కేంద్రం పై పోరాడి విజయం సాధించినందుకు మేము ఇది చేస్తున్నాం. రైతుల దీక్షకు మా ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. బందులకు కూడా సహకరించింది. మరి చంద్రబాబు ఏ కారణంతో కొవ్వొత్తుల నిరసన చేపట్టారు అన్నారు. మరోసారి చెప్తున్నాం.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను నమ్మవద్దు.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో విషాన్ని ఎక్కిస్తున్నారు. ఇంతకంటే వికృత రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. అలాంటిది మేము ఎందుకు తిడతాము… అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న ఐనా వేశారా… అనవసర మాటలతో రాద్దాంతం చేసింది చంద్రబాబు. వివేకా హత్య జరిగినప్పుడు ప్రభుత్వం నడుపుతున్నది ఎవరు… ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదు… అసెంబ్లీలో మైకు కట్ చేసినా క్షణాల్లో సెల్ ఫోన్ లో ఎలా వీడియో తీశారు… ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారం. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నాం. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!