1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
- 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
- రాహుల్ గాంధీ నివాసం వద్ద సిక్కు నేతల ఆందోళన
- సజ్జన్ కుమార్‌ను ‘హీరో’, ‘రోల్ మోడల్’గా పేర్కొన్నారన్న ఆరోపణలు
- కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1984 Anti-Sikh Riots: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాలు కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసం ముందు నిరసన చేపట్టారు. మాజీ కాంగ్రెస్ నేత, సిక్కుల ఊచకోత ఘటనలో దోషిగా ఉన్న సజ్జన్ కుమార్‌ను కొందరు కాంగ్రెస్ నాయకులు ‘‘హీరో’’, ‘‘రోల్ మోడల్’’ అని కీర్తించడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ గురువారం మరణించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరిగాయి. రాహుల్ గాంధీ నివాసమైన 5, సునెహ్రీ భాగ్ రోడ్ వద్ద ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (DSGMC) అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లోన్ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సజ్జన్ కుమార్‌ను కాంగ్రెస్ హీరోగా పరిగణిస్తుందా.? అనే దానిపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. సిక్కు నాయకులు రాహుల్ గాంధీ సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘42 ఏళ్ల తర్వాత మా కుటుంబాల గాయాలను మరోసారి కదిలించారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు దీనిని అంగీకరించి క్షమాపణలు చెప్పాలి’’ అని సిక్కు నాయకులు డిమాండ్ చేశారు. నిరసనకారులు శనివారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
-
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Layoffs: ఇండియాలో లేఆఫ్ ప్రకంపనలు.. ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్..!
-
Arctic: ఆర్కిటిక్‌లో మంచు కరిగితే రూ.21లక్షల కోట్ల నష్టం?
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!