Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టీ నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గత 19 రోజులుగా కనిపించకుండాపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 3న వేటకు బయలుదేరిన ఈ బోటుతో 5వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ తెగిపోయింది. సాధారణంగా వేటకు వెళ్లినవారు తిరిగొస్తారనే నమ్మకంతో కుటుంబసభ్యులు ఈ నెల 13వ తేదీ వరకు వేచి చూశారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి బాధితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను యంత్రాంగం వేగవంతం చేసింది.
ఈ గాలింపు చర్యల్లో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు రెండు నేవీ హెలికాప్టర్లు బంగాళాఖాతంలో తీవ్రంగా శోధిస్తున్నాయి. విశాఖపట్నం, చెన్నై నుంచి వచ్చిన నేవీ నౌకలు సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నాయి. కాకినాడ, విశాఖ కోస్ట్ గార్డ్ బృందాలు, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు పరస్పర సమన్వయంతో నేడు ఐదో రోజు కూడా గాలింపు ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
మరోవైపు పోలీసులు బాధితుల సెల్‌ఫోన్ నంబర్లను సేకరించి, వారి కాల్ డేటాను విశ్లేషిస్తూ సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సదరు బోటులో ముందస్తు జాగ్రత్తగా VHF ట్రాన్స్‌పాండర్ పరికరాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్లే కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయి, వారి లొకేషన్‌ను గుర్తించడం కష్టతరంగా మారింది. మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ త్వరలోనే అందించనున్నారు.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వాంబర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!