Gudivada Amarnath: పీకే ప్రతిపాదన.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్‌నాథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నాయకుడే అన్నారు.
Read Also: Pawan Kalyan: ఆడపిల్లలకు రక్షణ కరువు.. దిశ చట్టం ఎప్పటి నుంచి..?
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఇక, కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని ఎదిరించి నిలబడ్డ మొగోడు వైఎస్ జగన్ ఒక్కడే అన్నారు గుడివా అమర్‌నాథ్… 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి దిగజార్చింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతో పొత్తులా..!? నవ్విపోతారు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న విషయం తెలిసిందే.. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో పీకే కీలక పాత్ర పోషించారు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో వ్యూహాలకు పదునుపెట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు, తాజగా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బయటకు వచ్చింది… దాని ప్రకారం, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లాలని.. తెలంగాణలో విడిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసివెళ్లాలని సూచించారు పీకే. ఈ ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
తాజావార్తలు
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్‌ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
-
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..