Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
- దుబాయ్ నుంచి రాగానే సీబీఐ అదుపులోకి
- మహదేవ్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై కీలక ఆధారాలు
- రాయ్‌పూర్ కోర్టుకు నిందితుడి తరలింపు
- విదేశాల్లో ఉన్న ప్రమోటర్లపై సీబీఐ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్ల రూపాయల విలువైన ‘మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్’ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన పురోగతి సాధించింది. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి, సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిర్వహించిన తనిఖీల్లో అభిషేక్ వద్ద నుంచి బెట్టింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పలు కీలక పత్రాలు, నేరపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దుబాయ్‌లో స్థిరాస్తుల కొనుగోలు.. రాయ్‌పూర్ కోర్టు కస్టడీకి నిందితుడు
సీబీఐ దర్యాప్తు వివరాల ప్రకారం, ‘మహదేవ్ బుక్’ పేరుతో సాగిన అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ , జూద కార్యకలాపాల నిర్వహణలో అభిషేక్ కుమార్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాడు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న బెట్టింగ్ ప్యానెళ్లను సమన్వయం చేయడం, నిధుల సేకరణను పర్యవేక్షించడం , బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో దుబాయ్‌లో భారీగా స్థిరాస్తులను కొనుగోలు చేయడంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. ఈ స్కామ్‌లోని ప్రధాన నిందితులైన సౌరభ్ చంద్రకర్, శుభమ్ సోనీలతో నేరుగా కలిసి అభిషేక్ ఈ అక్రమ నెట్‌వర్క్‌ను నడిపినట్లు విచారణలో తేలింది. అరెస్ట్ అనంతరం నిందితుడిని హైదరాబాద్ స్థానిక కోర్టులో హాజరుపరిచిన సీబీఐ అధికారులు, 3 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొంది రాయ్‌పూర్ తరలించారు. అనంతరం రాయ్‌పూర్ కోర్టు నిందితుడికి 2 రోజుల సీబీఐ పోలీస్ కస్టడీ విధించింది.
Also Read
100 మందిపై ఛార్జిషీట్లు.. రెడ్ కార్నర్ నోటీసులతో ప్రమోటర్ల వేట
ఈ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 13 ఎఫ్ఐఆర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేయగా, రంగంలోకి దిగిన సీబీఐ విస్తృత దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు ప్యానెల్ ఆపరేటర్లు, హవాలా నిర్వాహకులు , ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో సహా మొత్తం 100 మంది నిందితులపై 8 ఛార్జిషీట్లను దాఖలు చేశారు. విదేశాల్లో పరారీలో ఉన్న ప్రధాన ప్రమోటర్లను భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చర్యలు తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 7 రెడ్ కార్నర్ నోటీసులు, 2 ఎక్స్ట్రాడిషన్ ప్రతిపాదనలను పంపగా, మరో ఇద్దరు నిందితుల అప్పగింత ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అక్రమ బెట్టింగ్ ద్వారా ఆర్జించిన నేరపూరిత ఆస్తులను గుర్తించి జప్తు చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!