GO Number 1: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ జీవో నంబర్ 1పై విచారణ జరగనుంది.. హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణ జరగబోతోంది.. హైకోర్టులో సీపీఐ రామకృష్ణ, జర్నలిస్ట్ బాలగంగాధర తిలక్ లు వేసిన పిటిషన్లను కలిపి ఇవాళ విచారించనుంది హైకోర్టు.. జీవో నంబర్ వన్‌పై ఇరు వర్గాల వాదనలు విననుంది హైకోర్టు.. కాగా.. జీవో నెంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోం అంటూ తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జనవరి 23న విచారణ జరిపించాలని ఆదేశించిన విషయం విదితమే.
Read Also: Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. 70 ఏళ్లుగా మమ్మల్ని దోచేస్తున్నారు..
ఇక, సుప్రీంకోర్టు ఆదేశంతో మరోసారి జీవో నంబర్ 1పై తిరిగి ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది.. అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మెరిట్స్ పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సీజే వ్యాఖ్యానించారు. అలాగే జీవో నెంబర్ 1పై ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ.. ఇటువంటి సమయంలో ఈ కేసుపై తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. కాగా, ప్రకాశం జిల్లా కందుకూరు.. గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11మంది ప్రాణాలు కోల్పోయారు.. ఆ తర్వాత రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని జారీ చేయగా.. ఈ జీవోపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు్నాయి..