Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్‌ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా రూ.20వేలు డిమాండ్ చేసింది. దీంతో జయశివ అనే బాలుడి మృతదేహాన్ని తరలించడానికి భారీ స్థాయిలో నగదును డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్లు.. ప్రైవేట్ అంబులెన్స్‌ను ఆస్పత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బైక్‌పైనే బాలుడి మృతదేహాన్ని తరలించారు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపలా కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని అంబులెన్స్ డ్రైవర్లను వేడుకున్నా వారు కనికరించలేదు.
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు. మృతదేహాల విషయంలో వ్యాపారం చేసే దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి రజినీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!