తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్‌ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కాగా…