బంగారం ప్రతి ఒక్కరికీ అవసరమే కానీ, అది దొంగ సొత్తు అయితే.. అందరికి ప్రమాదమే. విదేశాల నుంచి తీసుకువస్తూ విమానాశ్రయాల్లో పట్టుపడుతుంటారు కొందరు. దేశ విదేశాల నుంచి వారి టాలెంట్ ఆధారంగా బంగారాన్ని పెస్టులా, రేకుల్లా, చైన్ రూపంలో, టాబ్లెట్ల, బిస్కెట్ల రూపంలో ఏదో ఒక విధంగా రాష్ర్టంలో తీసుకు వచ్చేందుకు పలురకాల ప్లాన్స్ వేస్తూ వస్తుంటారు. కానీ అక్కడ నుంచి తప్పించుకున్నా కస్టమ్స్ అధికారుల చేతుల్లో మాత్రం దొరికి పోతుంంటారు. అయినా వారి ప్రయాణం మాత్రం ఆగడంలేదు. కస్టమ్స్ అధికారులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా బంగారాన్ని తరలించేందుకు ఏమాత్రం భయపడకుండా వెనుకగడం లేదు. అరెస్ట్ చేస్తారనే భయం కూడా లేకుండా వారిపని వారు చేసుకుంటూ పోతున్నారు.
అయితే ఇవాళ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇండోనేషియా ప్రయాణీకుల వద్ద 76.5 లక్షల విలువ చేసే 1700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని గాజులుగా మార్చి కార్బన్ పేపర్ లో చుట్టి లగేజ్ బ్యాగ్ లో దాచడంతో.. ఎయిర్ పోర్ట్ లో స్కానింగ్ కు చిక్కిన అక్రమ బంగారం రవాణా గుట్టు రట్టైంది. దీంతో కస్టమ్స్ అధికారులు బంగారం సీజ్ చేసారు. ప్రయాణీకులను అరెస్ట్ చేసారు. బంగారం రవానా చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
నిన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. గురువారం సాయంత్రం దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా, సీఎంఓ కార్యాలయంలో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి బంగారం తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా సంస్థలో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది బంగారం దాటవేసే విషయంలో పెద్ద పాత్ర ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Thieves in Hyder Guda: హైదర్ గూడలో దొంగల హల్ చల్.. బంగారు, నగదుతో మాయం