ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.…
ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ను నిన్ననే బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైపోయింది.. కొన్ని కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. సవాంగ్‌ను కొనసాగిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు అనూహ్యంగా బదిలీ చేసింది.. ఇక, కొత్త డీజీపీ…