ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. సీఎం పేషీలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ను నిన్ననే బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇవాళ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసేందుకు సిద్ధమైపోయింది.. కొన్ని కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. సవాంగ్‌ను కొనసాగిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు అనూహ్యంగా బదిలీ చేసింది.. ఇక, కొత్త డీజీపీ…
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే బెస్ట్ డీజీపీగా నిలిచారు. ఆయన ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ది బెటర్ ఇండియా సంస్థ విడుదల చేసింది. గత రెండేళ్లలో కరోనా కారణంగా ఎదురైన అనేక కఠినమైన సవాళ్లను డీజీపీ సవాంగ్ ఎదుర్కొన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.…
మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా…
పోలీసుశాఖలో రిక్రూట్‌మెంట్ పై అపోహలు, అనుమానాలు వద్దని తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్… మహిళా సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమయ్యే దిశగా ముందుకు కదులుతోందన్నారు.. ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు శాఖ ప్రతినిధి ఉండాలనే…