CM YS Jagan: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో ఉన్న అవకాశాలను గుర్తుచేశారు.. ఇక, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు.. సంస్థలు, రంగాల గురించి చెబుతూనే.. రాజధానిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.. విశాఖే పరిపాలనా రాజధానిగా స్పష్టం చేసిన సీఎం జగన్.. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందన్న సీఎం.. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్నారు.. భౌగోళికంగా పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందన్నారు.. రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉందని వెల్లడించారు.. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. త్వరలోనే ఇది సాకారం అవుతుందన్న సీఎం.. నేను కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన చేయబోతున్నాను అంటూ జీఐఎస్ వేదికగా ప్రకటించారు.
Read Also: Global Investors Summit 2023: ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉద్యోగాలు..
ఇక, విశాఖలో జీఐఎస్ నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు సీఎం జగన్.. ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను.. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఈ రోజు 92 ఎంవోయూలు వస్తాయని.. ఇవాళ దాదాపు 4 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎంవోలు జరిగితే.. మిగతావి రేపు జరుగుతాయని వెల్లడించారు.. మొత్తంగా రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కాగా, విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నారు.. మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతూనే ఉంది వైఎస్ జగన్ సర్కార్.. మూడు రాజధానులు తమ విధానమని స్పష్టం చేసిన సర్కార్.. విశాఖలో పారిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.. దీనిపై ఎన్నోసార్లు మంత్రులు, వైసీపీ నేతలు క్లారిటీ ఇచ్చారు.. ఈ మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ సీఎం వైఎస్ జగన్.. వైజాగ్ క్యాపిటల్‌పై స్పష్టంగా చెప్పారు.. ఇవాళ మరోసారి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించారు.