Global Investors Summit 2023: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది.. ఇవాళ ప్రారంభమైన జీఐఎస్.. రెండు రోజుల పాటు కొనసాగనుంది.. ఇక, ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖలో జీఐఎస్ జరగడం గర్వంగా ఉందన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.. ఇవాళ 92 ఎంవోయూలు జరుగుతాయి.. వీటి ద్వారా 4 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. మిగిలిన ఎంవోయూలు రేపు జరుగుతాయని వెల్లడించారు.. పెట్టుబడులకే కాదు పకృతి అందాలకు కూడా విశాఖ నెలవు అని పేర్కొన్నారు.. ఇక, భారత దేశంలో అతి కీలకమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతా విస్తరించి ఉన్నాయన్నారు.. విశాఖపట్నం చిన్న ఎకనామిక్ హబ్‌గా అభివర్ణించిన సీఎం.. సెప్టెంబర్‌లో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్‌కు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు… మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సిటీ వైజాగ్ అంటూ ఆహ్వానించారు..
Read Also: Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
ముఖ్యమైన జీ 20 సదస్సుకు ఒక చిన్న రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతుందన్నారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రం సొంతం అన్నారు.. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయని వెల్లడించారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్‌గా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాం. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పారిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..