ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్‌మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.. సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు రాజధానులను టీడీపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స… మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఏక్షణం నుంచైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని ప్రకటించారు.. ఇక, సమావేశాలు ఎక్కడి నుంచైనా నిర్వహించుకోవచ్చని కోవిడ్ మహమ్మారి తర్వాత నిరూపితమైందన్నారు. విశాఖలో రాజధానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయి…. అవసరం అయితే పెంచుకుంటాం.. అందు కోసం సంవత్సరాలు, యుగాలు అవసరం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.