Ramprasad Reddy: రాయచోటి మత సామరస్యానికి ప్రతీక.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు..!
- రాయచోటి మత సామరస్యానికి ప్రతీక- మంత్రి రాంప్రసాద్ రెడ్డి
- ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు- రాంప్రసాద్ రెడ్డి
- కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయి
- ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం కాదు- రాంప్రసాద్ రెడ్డి
- చంద్రబాబు చొరవ వల్లే ఇంజనీరింగ్ విద్య గ్రామీణ విద్యార్థులకు దగ్గర అయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత తిరుపతి వారాధి (77) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఎట్టకేలకు ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యం కాదని అన్నారు. కొందరు అల్లరి మూకలు చేసిన తప్పిదం వల్ల ఆ ఘటన జరిగింది.. ఈ ఘటన వెనక ఎవరి ప్రోత్సాహం ఉన్న వదలమని హెచ్చరించారు. మత సామరస్యంను చెడగొట్టడం ఎవరివల్ల కాదు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Sankranthiki Vasthunam: టీఆర్పీ రేటింగ్స్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” సరి కొత్త రికార్టు
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
మరోవైపు.. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువగా పోయేది ఇంజనీరింగ్ కళాశాలలకు అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. చంద్రబాబు చొరవ వల్లే ఇంజనీరింగ్ విద్య గ్రామీణ విద్యార్థులకు దగ్గర అయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయో గమనించాలి.. ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడేలా చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన ఎనిమిది నెలల్లో 700 కోట్లు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను ఆదుకున్నామని వెల్లడించారు. మరోవైపు.. గత ప్రభుత్వంలో 50 నుంచి 60 కాలేజీలు మూతపడ్డాయి.. తప్పు చేసింది వాళ్లు, ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అటువంటి దీక్షలకు ప్రజలు హర్షించరు.. అమెరికాలో కూడా తెలుగువారు శాసించే స్థాయిలో ఉన్నారంటే అది చంద్రబాబు ఘనతేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read Also: Annamalai: ‘‘మూర్ఖపు స్టాలిన్’’.. ‘‘రూపాయి గుర్తు మార్పు’’పై అన్నామలై ఫైర్..
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?