ఈ మధ్య ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ సంచలనాత్మక కేసు బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమునా గ్రామానికి చెందినది.
Tejeshwar Murder : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన తేజేశ్వర్ హత్యకేసులో అసలు కథ బయటపడింది. ఈ కేసుపై గద్వాల జిల్లా ఎస్పీ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి నిందితుల కుట్రను బహిర్గతం చేశారు. తేజేశ్వర్ హత్య వెనుక ఉన్న ప్రేమ, ద్వేషం, కుట్రలను ఎస్పీ వివరించారు. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబం తేజేశ్వర్‌తో ఎంగేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో…
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ విచారించనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొందరు దుండగులు హత మార్చారు. అర్ధరాత్రి సమయంలో వినోద అనే వృద్ధురాలిని చంపేసి.. ఆమె ఇంట్లోనే ఉన్న బావిలో పడేశారు.