APTF: ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ఏపీటీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APTF: ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీలో ఈనెల 5న జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ప్రకటించింది. ఏపీలో ఉపాధ్యాయులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ ఆరోపించింది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి అందే సన్మానాలను కూడా తిరస్కరించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
Read Also: Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఉపాధ్యాయులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధిస్తోందని.. బైండోవర్ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని ఏపీటీఎఫ్ వెల్లడించింది. సొంత ఫోన్లలో ఫోటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని.. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఏపీటీఎఫ్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డివైస్‌లు ఇచ్చేవరకూ ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో హాజరు నమోదు చేయబోమని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ మంజుల, కె.భానుమూర్తి స్పష్టం చేశారు. యాప్‌లో హాజరు నమోదుపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుందని చెప్పిన అధికారులు మాట మార్చారని.. మంత్రితో జరిగిన చర్చల్లో ప్రభుత్వమే డివైస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. అయినా సంఘాలన్నీ ఫోన్లలో హాజరు వేసేందుకు అంగీకరించాయన్నారు. అటు ఏపీటీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) కూడా మద్దతు తెలిపింది. సోమవారం నాటి ఉపాధ్యాయ దినోత్సవాలకు హాజరు కాకూడదని తన సభ్యులకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!