HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- మరో 4 చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం
- వాకింగ్ ట్రాక్‌లు, బోటింగ్‌తో కొత్త రూపు
- పూడికతీతపై రంగనాథ్ కఠిన ఆదేశాలు
- రెండో విడతలో 14 చెరువుల ఆధునీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA : నగరంలో వరదల కట్టడి, భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ. 107 కోట్ల భారీ వ్యయంతో మరో నాలుగు ప్రముఖ చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధికారికంగా ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు, కాముని చెరువుల వద్ద ఆయన స్వయంగా భూమి పూజ చేసి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాలుగు చెరువులకు సరికొత్త రూపు.. పర్యాటక కేంద్రాలుగా మార్పు
హైడ్రా చేపట్టిన ఈ పునరుద్ధరణ జాబితాలో ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ చెరువు, కాముని చెరువు, కాప్రా చెరువులు ఉన్నాయి. మొత్తం 311 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ నాలుగు చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. వీటిని కేవలం జలాశయాలుగానే కాకుండా, స్థానికులకు ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు (పాత్‌వేలు), ఓపెన్ జిమ్‌లు, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ (Tourism Department) సహకారంతో త్వరలోనే బోటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
పూడికతీతపై కమిషనర్ కఠిన ఆదేశాలు.. రెండు విడతల్లో పనులు
చెరువుల పునరుద్ధరణలో భాగంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికను పూర్తిగా తొలగించాలని, నీరు వచ్చే ఇన్లెట్లు, వెళ్లే ఔట్లెట్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలని కాంట్రాక్టర్లకు కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో చెరువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న హైడ్రా.. ఇప్పటికే మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధిని విజయవంతంగా చేపట్టగా, ఇప్పుడు రెండో విడతలో భాగంగా మొత్తం 14 చెరువులను ఆధునీకరించేందుకు విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!