Teacher Dance: ఈమధ్య కాలంలో చాలామంది ఉపాధ్యాయులు స్కూల్, కళాశాలలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కాస్త ఆలస్యంగా ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఓ టీచర్ చేసిన డాన్స్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక లేడి టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు…
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని…
Teachers day 2024 Teachers day wishes: తప్పుడు మార్గంలో వెళ్లకుండా మనల్ని రక్షించేది తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే. వారు జీవితంలోని తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తారు. సమాజంలో మనల్ని మంచి వ్యక్తిగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు, సెప్టెంబరు 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీరు మీ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒక గురువు ఉంటారు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం టీచర్ చేస్తున్న…
మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు.
Rahul Gandhi: తన ప్రత్యర్థులు కూడా తనకు గురువులే అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. టీచర్స్ డేని పురస్కరించుకుని ఆయన అన సందేశాన్ని వినిపించారు. తన ప్రత్యర్థులు ప్రవర్తన, అబద్ధాలు, మాటలు తనను సరైన మార్గంలో ఉంచుతాయని ఆయన అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులకు నివాళులర్పించారు.
Somu Veerraju: విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును సోము వీర్రాజు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో నృత్యం చేసిన చిన్నారి గురించి ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడు అని.. భరత నాట్యాన్ని అభ్యసించాడని.. బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని.. భరత…
Special Story on Teacher's Day: ఈ రోజు సెప్టెంబర్ 5. టీచర్స్ డే. టీచ్ అంటే బోధించటం (లేదా) నేర్పటం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతిఒక్కరూ టీచర్లే. పుట్టిన దగ్గరి నుంచి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. ఆ క్రమంలో మనకు ఎందరో టీచర్లు. ప్రతి వ్యక్తి జీవితమూ పలువురితో ముడిపడి ఉంటుంది. అందుకే ఏడాదిలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతోంది.