CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కర్ణాటకలో జరిగిన తుంగభద్ర డ్యామ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నది తల్లికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని పేర్కొన్న ఆయన, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ సమావేశం మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. తుంగభద్ర డ్యామ్‌కు 75 సంవత్సరాల ఘన చరిత్ర ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా కోట్లాది ప్రజల జీవితాలకు ఆధారంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు గత 70 ఏళ్లుగా తాగునీరు, సాగునీటిని అందిస్తూ తుంగభద్ర డ్యామ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
గతంలో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు సీఎం చంద్రబాబు… అప్పటి కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి డీకే సుకుమార్ చొరవతో సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల వంటివని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. తుంగభద్ర డ్యామ్ భద్రత, సామర్థ్యాన్ని పెంచే దిశగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 33 గేట్లను ఏర్పాటు చేసి డ్యామ్‌కు కొత్త శోభ తీసుకొచ్చామని పేర్కొన్నారు. నీటి వనరుల పరిరక్షణ, రాష్ట్రాల మధ్య సమన్వయం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత అవసరమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తుంగభద్ర డ్యామ్ పునరుద్ధరణ కార్యక్రమం మూడు రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!